శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం.
కోరుట్లలో ఘనంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మూడవ వార్షికోత్సవం.
అక్టోబర్ 25, న వేడుకలు
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్ 23: తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25, వ తేదీ ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని మెట్టుపల్లి, రోడ్డులో గల జీ.ఎస్. గార్డెన్స్‌లో శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించను న్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం జీ.ఎస్.గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లా డారు. 2024, లో సంస్థ తొలి వార్షికోత్సవాన్ని కరీంనగర్ లోని టీటీడీ కళ్యాణ మండపంలో, రెండవ వార్షికోత్సవాన్ని కరీంనగర్ లోని పీవీఆర్ ప్లాజా, ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహిం చామని తెలిపారు. ప్రస్తుతం మూడవ వార్షికోత్సవాన్ని కోరుట్లలో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నా మని వెల్లడించారు.
మూడేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ స్థాపించిన నాటి నుంచి గత మూడు సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు, తలసే మియా బాధితులకు రక్త సహాయం, పర్యావరణ పరిరక్షణ, మొక్కల నాటడం, సీడ్ బాల్స్ తయారీ, విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో సేవాభావాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నామని వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత వార్షికోత్స వంలో ప్రపంచ రికార్డును సాధించడం సంస్థకు గర్వకా రణమని తెలిపారు. సేవే లక్ష్యంగా, మానవత్వమే మార్గంగా శ్రీనివాసులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా గుర్తింపు తీసుకురావడమే సంస్థ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ప్రతి శ్రీనివాసుడు మరో ఇద్దరిని తీసుకురావాలి.
ఈ నెల 25, న జరిగే తృతీయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కోరుట్ల శ్రీనివాసుల సలహా మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న శ్రీనివాస మిత్రులందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ప్రతి శ్రీనివాసుడు తనతో పాటు మరో ఇద్దరు శ్రీనివాసులను తీసుకు వచ్చి, ఈ ఐక్యతా వేడుకను మరింత విజయవంతం చేయాలని వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి పిలుపు నిచ్చారు.
కార్యక్రమ వివరాలు:
కార్యక్రమం: శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవం తేదీ: 25, ఆదివారం శ్రీనివాసుల సేవా సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కోరుట్ల శ్రీనివాసుల సలహా మండలి ప్రతినిధులు, సంస్థ సభ్యులు, వివిధ ప్రాంతాల శ్రీనివాస మిత్రులు సమన్వయంతో కృషి చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో నీలి శ్రీనివాస్ శ్రీరాముల శ్రీనివాస్ బెజ్జరపు శ్రీనివాస్ తూం శ్రీనివాస్ చిలుక శ్రీనివాస్ పోతుగంటి శ్రీనివాస్ సంగ శ్రీనివాస్ బెజ్జారపు శ్రీనివాస్ బాజోజి శ్రీనివాస్ గాంధారి శ్రీనివాస్ కటకం శ్రీనివాస్ ఉడుత శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంద్రాల శ్రీనివాస్ ఒటారికారి శ్రీనివాస్ బొల్లెపల్లి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ ఓనర్ గంగుల రాజశేఖర్ గౌతమ్ విశిష్ట తొగిటి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
నినాదం:
“పేగు బంధం కాదిది… పేరు బంధం!”
హలో శ్రీనివాస్… ఛలో కోరుట్ల!
శ్రీనివాసుల ఐక్యతకు, సేవాభావానికి ప్రతీకగా నిలిచే ఈ తృతీయ వార్షికోత్సవంలో ప్రతి శ్రీనివాస మిత్రుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ కోరుతోంది.





























