ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్ 24: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీసు సిబ్బందిలో వృత్తి పరమైన నైపుణ్యాలను పెంపొందించడం, సామాజిక బాధ్యతను గుర్తుచేయడం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేయ డంతో పాటు ప్రజానుకూల పోలీసింగ్పై అవగాహన కల్పించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని అధికారు లు తెలిపారు.ఈ పోటీలను రెండు విభాగాలుగా నిర్వ హించారు. మొదటి విభాగంలో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ నుంచి అసి స్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదా వరకు ఉన్న సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి కింది అంశాలను కేటాయించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఎలాంటి సేవలను ఆశిస్తారు. పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర ఏమిటి? సోషల్ మీడి యాకు బానిస కాకుండా వ్యక్తిగత, సామాజిక ప్రయో జనాల కోసం దానిని సద్వి నియోగం చేసుకోవడం ఎలా? రెండో విభాగంలో భాగంగా సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) మరియు ఆపై హోదాల్లో ఉన్న అధికారులకు కింది అంశాలను కేటాయించారు.పౌరుల నుంచి గౌరవం, ఆదరణ, సద్భావన పొందేందుకు పోలీసులు ఎలాంటి కృషి చేయాలి?క్షేత్రస్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఎలా?ఈ వ్యాసరచన పోటీల ద్వారా పోలీసు అధికారులు, సిబ్బంది తమ ఆలోచనలు, అనుభవాలు, విధి నిర్వహ ణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనుసరించాల్సిన విధానాలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచే అవకాశం కల్పించారు.






























