ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి నిర్మల్ నవంబర్ 29: నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం, యాకర్‌పల్లి గ్రామంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవ మహోత్సవాలకు బీజేఎల్పీ నేత, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తక్కల రమణ రెడ్డి, జమాల్,మండల అధ్యక్షులు కాల్వ నరేష్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మేకల చంద్రశేఖర్, మేకల నవీన్‌ యాదవ్, శ్రవణ్ కుమార్, మహేశ్వర్ రెడ్డి, రాథోడ్ నారాయణ , విలాస్, చారి,వెంకటేష్, అంబాజీ,కృష్ణ రెడ్డి,,తో పాటు గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News