Trending Now

ఓటు వేస్తూ ఫోన్‌లో చిత్రీకరణ.. యువకుడిపై కేసు నమోదు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 14 : నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువ ఓటరు ఎన్నికల ప్రవర్తన నియమావళీని ఉల్లంఘించాడు. తాను ఓటు వేస్తున్న గా మొబైల్ ఫోన్ లో అదృశ్యాలను చిత్రీకరించాడు. దీని గుర్తించిన నిర్మల్ మండలంలోని అనంతపేట గ్రామంలో ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబర్ 163 ఎన్నికల పోలింగ్ నిర్వహణ సిబ్బంది తగిన విధంగా మందలించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని వెబ్ కాస్టింగ్ లో జిల్లాస్థాయి అధికారులు గమనించి యువకుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ ఆర్డీవో ఆదేశాల మేరకు ఆ యువకుని పై రూట్ ఆఫీసర్ అజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.

Spread the love

Related News

Latest News