ప్రతిపక్షం, మంథని, మే 18 : 2024-25 సంవత్సరానికి పెద్దపల్లి జిల్లాలోని విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనానికి మే 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి. జనార్దన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్ స్థాయి పి.హెచ్. డి. పోస్ట్, డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం నందు చదవాలనుకునే గిరిజన విద్యార్థిని, విద్యార్థులు ఈ పథకానికి అర్హులని అన్నారు. ఎంపికైన గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులైన గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఈనెల 31లోగా https://overseas.tribal.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.