ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : పిడుగుపాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గురజాల తండాలో చోటుచేసుకుంది. తమ పంట చేనులో వానకాలకు సాగు కోసం పనిచేస్తుండగా జాదవ్ కృష్ణ (13 )అనే బాలుడిపై పిడుగు పడిగా.. ఘటన స్థలంలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన జాదవ్ కృష్ణను స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నిర్మల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో నిర్మల్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సలు అందిస్తుండగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.