Trending Now

Iran Israel Attack: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి

Iran Launches Missile Attack At Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మెజ్ బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ రంగప్రవేశం చేసింది. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 400లకుపైగా క్షిపణులు ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్లు జరిపింది. చనిపోయిన హమాస్ అధినేత ఇస్మాయెల్ హనీయా, హెజ్ బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, నిల్పోరూషన్ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమయంలో ఎవరూ కూడా బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Spread the love

Related News

Latest News